పవిత్ర పుణ్యక్షేత్రం వెలసిన రామేశ్వరంలో పర్యాటకులను, ఆ ప్రాంత ప్రజలను కొన్ని రెస్టారెంట్లు మోసం చేస్తున్నాయి. రామేశ్వరంలోని కొన్ని రెస్టారెంట్లు చికెన్ వంటకాల కోసం కోళ్లను కొనకుండా విడిగా మాంసాన్ని కొంటున్నాయి. ఎందుకంటే... కోళ్లను కొంటే వాటిని వండేందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. అదే చికెన్ కొంటే ఈజీగా వండేయొచ్చు. కానీ రామేశ్వరం రెస్టారెంట్లు మాత్రం చికెన్‌కు బదులు కాకుల మాంసాన్ని కొంటున్నాయి.
చికెన్‌తో పాటూ కాకుల మాంసాన్ని మిక్స్ చేస్తున్నారు. రెస్టారెంట్లకు చికెన్ మాంసం పేరుతో కాకుల మాంసం మిక్స్ చేసిన దాన్ని అమ్ముతున్నారు. రెస్టారెంట్ల యజమానులకు ఈ విషయం తెలియదు కదా. వాళ్లు చికెనే అని కొనేసి... వండేస్తున్నారు. కస్టమర్లు కూడా చికెన్ మాంసమే అనుకొని తినేస్తున్నారు. చివరికి జరగాల్సిన దారుణం జరిగిపోతోంది.
ఈ విషయం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు తెలిసింది. ఉన్నట్టుండి జరిపిన దాడుల్లో 150 కాకులు ఒకేసారి చావడం వెనుక రహస్యాన్ని కనిపెట్టారు. ఈ దారుణానికి పాల్పడుతున్న ఇద్దర్ని అరెస్టు చేశారు. 150 పక్షుల మాంసాన్ని సీజ్ చేశారు.
రామేశ్వరంలో పితృదేవతలు పెడుతున్న పిండంలో లిక్కర్లను కలిపి కాకులు అలా మత్తులో పడిపోతే.. వాటిని చికెన్ షాపులకు అమ్ముతున్నారు. ఆ చికెన్ షాపుల యజమానులు చికెన్ మాంసంలో కాకుల మాంసం కలిపేసి... రెస్టారెంట్లకు అమ్ముతున్నారు. వాటిని జనాలు తెలియకుండా తినేస్తున్నారు.