ఎంత గింజుకున్నా... సీఎం రేవంత్ రెడ్డి నా స్థాయికి రాలేరు : హరీశ్ రావు

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:55 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పిచ్చివేషాలు వేసినా.. ఎంతలా ఎగిరెగిరి పడినా తన స్థాయికి చేరుకోలేరన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరని వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
తాను తాటి చెట్టంత ఎదిగాను సరే... నువ్వు కనీసం వెంపలి చెట్టంత ఎత్తయినా లేవు కదా అని ఎద్దేవా చేశారు. తన గురించి రేవంత్‌కు ఎందుకంత బాధ? ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు.
 
ఎక్కడ దాక్కున్నావంటూ రేవంత్ మాట్లాడుతున్నారు... తాను ఎక్కడా దాక్కోలేదు, రేవంత్ గుండెల్లోనే ఉన్నా... రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాం... మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించారు.
 
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. 100 రోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామన్నారు... రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, అంతా బోగస్ చేశారు, అన్ని విధాలుగా రైతులను మోసం చేశారంటూ విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments