Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవవధువు గొంతుకోసిన ప్రేమోన్మాది.. హోలీ కోసం పుట్టింటికి రావడంతో..

ప్రేమోన్మాది నవవధువు గొంతుకోశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో గొంతుకోశాడు. ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వి

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (12:24 IST)
ప్రేమోన్మాది నవవధువు గొంతుకోశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో  గొంతుకోశాడు. ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ టౌన్ షిప్‌కు చెందిన 26 ఏళ్ళ యువతికి ఈ నెల 4వ, తేదిన సోనేపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. 
 
పెళ్లికి తర్వాత వచ్చిన తొలి హోలి పండుగను జరుపుకునేందుకు పుట్టింటికి వచ్చింది. అయితే ఆమెపై కోపంతో రగిలిపోతున్న పొరుగింటి యువకుడు రాజీవ్ కశ్యప్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసి పరారయ్యాడు. 
 
ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కశ్యప్ తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో తనను చంపేయాలనుకున్నాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments