Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భార్యకు వెన్నెముక గాయం.. వరుడు ఏం చేశాడంటే?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:31 IST)
కాబోయే భార్యకు తీవ్ర గాయమైతే ఆ వరుడు ఆదుకునేందుకు సిద్ధం అయ్యాడు. తనకు కాబోయే భార్య వెన్నెముకకు గాయమైనప్పటికీ.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు. ముందే నిశ్చయించుకున్న ముహుర్తానికి.. ఆస్పత్రిలోనే డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన అద్వేష్‌కు, ఆర్తి అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజే ఆర్తి తన ఇంటిపై నుంచి కింద పడింది. దీంతో ఆమె వెన్నెముకతో పాటు కాళ్లకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముహుర్త సమయానికే పెళ్లి చేసుకోవాలని వరుడు అద్వేష్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు వైద్యుల పర్మిషన్ తీసుకున్నాడు.
 
వైద్యులు అనుమతించగానే.. బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఆర్తికి అద్వేష్ మూడు ముళ్లు వేసి తన జీవితంలోకి ఆమెను ఆహ్వానించాడు. అనంతరం కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఆ నూతన జంటను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments