Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు ముక్కు చిన్నదిగా ఉందని అమ్మలక్కల గుసగుసలు.. పెళ్లి వద్దన్న వధువు

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (20:24 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సివుంది. ఇంతలో పెళ్లికి వచ్చిన అమ్మలక్కలు వరుడు ముక్కు చిన్నదిగా ఉందంటూ గుసగుసలాడుకోసాగారు. ఈ విషయం వధువు చెవిలో పడింది. అంతే.. ఈ పెళ్లి తనకు వద్దంటూ వధువు అడ్డం తిరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు ఎంత చెప్పినప్పటికీ వధువు వినిపించుకోలేదు. దీంతో పెళ్లి రద్దు అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల సభ్యులతో పాటు గ్రామ పెద్దలు కూడా నిర్ణయించారు. బుధవారం పెళ్లి జరగాల్సి వుంది. ఇందుకోసం వధువు ఇంటికి వరుడు కుటుంబ సభ్యులు ఊరేగింపుగా వచ్చారు. పెళ్లికి వచ్చిన వారితో వధువు ఇల్లు సందడిగా మారింది.
 
ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన అమ్మలక్కలతో పాటు ఇరుగుపొరుగువారు, బంధువులు వరుడిని చూసి వరుడు బాగానే ఉన్నాడుకానీ ముక్కు చిన్నదిగా ఉందంటూ గుసగుసలాడటం మొదలు పెట్టారు. ఈ మాటలు వధువు చెవినపడ్డాయి. వారి మాటలు నిజమో కాదో తెలుసుకునేందుకు వధువు నేరుగా వరుడు వద్దకు వెళ్లి ముక్కును చూసింది. 
 
కాబోయే భర్త ముక్కు నిజంగానే కాస్తంత చిన్నదిగా ఉండటంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను అతడిని పెళ్లి చేసుకోబోనంటూ మంకుపట్టి పట్టింది. దీంతో ఖంగుతిన్న ఇరు కుటుంబాలవారు వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments