Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాటరీని నాలుకతో తాకిన బాలుడు.. ఏమైందంటే..?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (16:33 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు తన ఫోన్‌ బ్యాటరీని నాలుకతో తాకాడు. అంతే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్‌ జిల్లా మత్వార్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల మోనూ 6వ తరగతి చదువుతున్నాడు.
 
శుక్రవారం (మార్చి 26,2021) ఉదయం మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీని 'జుగాడ్ చార్జర్‌'లో ఉంచి చార్జింగ్‌ చేశాడు. గంట తర్వాత బ్యాటరీ చార్జింగ్‌ అయ్యిందా లేదా అవేది పరీక్షించేందుకు నాలుకతో టచ్‌ చేశాడు. అంతే.. పెద్ద శబ్దం చేస్తూ బ్యాటరీ అతడి ముఖంపైనే పేలిపోయింది.
 
శబ్దం విన్న కుటుంబసభ్యులు గదిలోకి వచ్చి చూడగా ముఖానికి తీవ్రగాయాలతో రక్తం మడుగులో మోను పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments