Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానం చేస్తుండగా పురిటినొప్పులు.. బాత్రూమ్ ఫ్లోర్‌లో రాజ శిశువు..!

Advertiesment
స్నానం చేస్తుండగా పురిటినొప్పులు.. బాత్రూమ్ ఫ్లోర్‌లో రాజ శిశువు..!
, గురువారం, 25 మార్చి 2021 (13:14 IST)
Zara Tindall
గర్భవతి అయిన ప్రిన్స్ సారా టిండల్‌కు పండంటి మగబిడ్డ జన్మించాడు. స్నానం చేస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు రావడంతో..  బాత్రూమ్ ఫ్లోర్ లోనే రాజ శిశువు జన్మించాడు. వివరాల్లోకి వెళితే.. కరోనా వ్యాప్తి కారణంగా ఇంగ్లండ్ మహారాణి రెండో ఎలిజిబెత్ పుట్టిన రోజు వేడుకలు రద్దు అయ్యాయి. తాజాగా ఎలిజెబెత్ కుమార్తె, మనవరాలు, ప్రిన్స్ సారా టిండల్‌కు మగశిశువు జన్మించడం.. రాజ కుటుంబంలో సంతోషాన్నినింపింది. 
 
ఈ శిశువు సారా టిండల్, ఇంగ్లండ్ రక్బీ ఆటగాడు మైక్ టిండల్ దంపతుల మూడో శిశువు కావడం గమనార్హం. ఈ దంపతులకు ఇప్పటికే ఏడేళ్ల ఓ కుమార్తె, రెండేళ్ల కుమార్తె వున్నారు. తాజాగా జన్మించిన మూడో బిడ్డకు లుకాస్ ఫిలిప్ అనే నామకరణం చేశారు.
 
కాగా నిండు గర్భిణీగా నుండి ప్రిన్స్ సారా టిండల్.. సారా స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో వున్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ కుదరక బాత్రూమ్‌లో ఆమెకు ప్రసవం ముగిసింది. ఈ బిడ్డకే లుకాస్ ఫిలిఫ్ టిండల్ అనే పేరు పెట్టారు. ఈ శిశువు మహారాణి ఎలిజిబత్ పదో ముని మనవడు కావడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య