Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు ఓ గుడ్ న్యూస్.. పంచామృతం ఇక ఇంటికే..!

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (11:32 IST)
అవును.. అయ్యప్ప ప్రసాదం ఇక ఇంటికే రానుంది. శబరిమల ఆలయానికి ఎంతో మంది అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు అందరూ స్వామివారిని దర్శించుకొని తమ దీక్షను విరమించడానికి వెళుతూ ఉంటారు. దీంతో శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి వారి ఆలయం కొన్ని రోజులే తెరుచుకుని వుంటుంది. 
 
అయినప్పటికీ అక్కడ భక్తులు మాత్రం కోట్లల్లో తరలివస్తుంటారు. అయితే శబరిమల ఆలయంలో ప్రసాదం ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రసాదం పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు భక్తుల్లో నెలకొన్నాయి.
 
దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న శబరిమల ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవస్థానం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది. పోస్టు ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందిస్తామంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుండగా.. అప్పటి నుంచే ప్రసాదాన్ని కూడా పోస్టు ద్వారా అందించేందుకు నిర్ణయించామంటూ చెప్పుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. అయితే కేరళ రాష్ట్ర వాసులకు అయితే రెండు రోజులు ఇతర రాష్ట్రాల వాసులకు అయితే వారం రోజుల సమయంలో ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments