Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:11 IST)
బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబ్ దాడి జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో మాత్రం ఓ రౌడి అనుచరులు బిర్యానీ పెట్టలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబ్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నారు. 
 
వారి హోటల్‌కు ఎబిన్ అనే రౌడీషీటర్ అనుచరులు బిర్యానీ కోసం వచ్చారు. రౌడీషీటర్‌ ఎబిన్‌ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ పెట్టాలని బెదిరించగా.. వారు అందుకు నిరాకరించారు. దీంతో హోటల్ దగ్గరే ఆగ్రహం వ్యక్తం చేసి ఎబిన్‌ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు.
 
కొంచెం సేపటి తర్వాత నాలుగు బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. దీనిపై హోటల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments