Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూవేల్ గేమ్‌ ఎఫెక్ట్: బాంబు బూచి.. పోలీసులకు చుక్కలు చూపించిన ఎంసీఎ విద్యార్థి

బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ విద్యార్థి సందీప్‌కుమార్ (21) బ్లూవేల్ గేమ్ ఆడుతూ అందులో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలోని అంతర్రాష్ట్ర ప్రయాణ

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (16:32 IST)
బ్లూవేల్ గేమ్‌ మృత్యుక్రీడగా మారింది. ఈ క్రీడపై నిషేధం విధించాలని డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఈ గేమ్‌పై కన్నెర్ర చేసింది. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌పై స్టే ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
 
ఇటీవల ఈ గేమ్ ఆడుతూ ముంబై, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ ఆన్‌లైన్ గేమ్‌ పరిణామాలపై దృష్టి సారించింది. ఈ గేమ్‌కు సంబంధించిన లింక్‌లు తొలగించాలంటూ గూగుల్, ఫే‌స్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, మైక్రోసాఫ్ట్, యాహూ వంటి సోషల్ మీడియా దిగ్గజాలను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే తాజాగా బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ విద్యార్థి సందీప్‌కుమార్ (21) బ్లూవేల్ గేమ్ ఆడుతూ అందులో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలోని అంతర్రాష్ట్ర ప్రయాణ ప్రాంగణంలో బాంబు ఉందని పోలీసులకు చుక్కలు చూపించాడు. పోలీసులకు ఫోన్ చేసి బాంబు వుందని చెప్పడంతో వారు పరుగులు తీసేలా చేశాడు. 
 
చివ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చి పోలీసులకు లొంగిపోయాడు. బ్లూవేల్‌లో క్రీడలో భాగంగా అలా చేయ‌మ‌న్నార‌ని.. అందుకే అలా చేశానని క్లారిటీ ఇచ్చాడు. గతంలో కూడా బ్లూవేల్‌లో భాగంగా త‌న బైక్‌ని అతి వేగంగా నడిపి ఆత్మహత్యాయ‌త్నం చేశాన‌ని తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments