బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.. చెప్పిందెవరంటే..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక కాషాయదళం బెంగాల్ కోటపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మమత కోటలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
తృణమూల్ కాంగ్రస్‌కు చెందిన కీలక నేతలను ఆకర్షిస్తోంది కమలం. ఇప్పటికే తృణమూల్ కు చెందిన సుబెందు అధికారి కమలం గూటికి చేరారు. ఆయనతో పాటుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే తృణమూల్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. 
 
తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. నేతలు పార్టీ మారుతుండటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధిస్తారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్నారు. ఈ ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments