Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (09:28 IST)
భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడుని నమ్మని వారంతా నిజమైన ముస్లింలు కాదని నకిలీ ముస్లింలన్నారు. భారతీయ నాగరికతకు సనాతన ధర్మమే పునాది అని, ముస్లింలందరూ సనాతన గుర్తింపు పంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాం ప్రవక్తల్లో రాముడు, కృష్ణుడు ఉండొచ్చని, ఆరాధనా విధానం మార్చుకున్నా... సంస్కృతి సనాతనమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇస్లాం కంటే ఎంతో ముందు సనాతన ధర్మ ఉంది. అది మన నాగరికతకు పునాది అని ఆయన అన్నారు. ఇస్లామిక్ బోధనలు కూడా ఉమ్మడి వారసత్వ భావనకు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఇస్లాంలో ఒకే ప్రవక్త కాకుండా అనేక మంది ప్రవక్తలు ఉన్నారనే నమ్మకాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
ఇస్లాంలో కేవలం ఒక ప్రవక్తనేకాకుండా అనేక మందిని విశ్వసిస్తాం. ఖురాన్‌లో కేవలలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. కానీ, హదీసులు, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,24,000 మంది ప్రవక్తలు పంపబడ్డారు. అలాంటపుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వారిలోలేరని మనం ఎలా చెప్పగలం? వారు కూడా మన దేవుని దూతలు అయి ఉండొచ్చు? అని సిద్ధిఖీ పేర్కొన్నారు. పైగా, "ముస్లింలందరూ శ్రీరాముడు వంశస్థులే అని అన్నారు. మనం ఆరాధనా పద్దతిని మార్చుకున్నాం... మన సంస్కృతిని కాదు... మన గుర్తింపు ఇప్పటికీ సనాతనమే" అని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments