Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖట్టర్ స్నేహితుడి కాల్చివేత

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (09:26 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం హత్య జరిగింది. సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్నేహితుడిని గుర్తుతెలియని దండగులు కాల్చి చంపేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సుఖ్‌బీర్ ఖతానా అలియాస్ సుఖిగా గుర్తించారు. 
 
రితోజ్ గ్రామానికి చెందిన సుఖి గురువారం తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్ళారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని తుటాల వర్షాలు కురిపించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. 
 
కాగా ఖతానా బావమరిది చమన్ తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు ఖతానా కుమారుడు అనురాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆర్ఆర్ఎస్ కార్యకర్త అయిన సుఖీ తాను హత్య కావడానికి కొన్ని గంటల ముందు తన ప్రొఫైల్ పిక్‌ను మార్చడం గమనార్హం. కాగా, హత్యకు పాల్పడినవారిలో పలువురిని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments