Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (11:58 IST)
గూఢచర్యం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చినట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇపుడు ఇది చర్చనీయాంశంగా మారింది. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు వెళ్ళిన సమయంలో కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ నిధులు సమకూర్చిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు, పర్యాటక శాఖమంత్రి పీఏ మహమ్మద్ రియాజ్ ప్రమేయం ఉందని కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రం ఆరోపించారు. 
 
పినరయి విజయన్ అల్లుడు రియాస్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ, పాకిస్థాన్ గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కన్నూర్ పర్యటనకు స్పాన్సర్ చేసింది. ఆమె కేరళలో ఎవరిని కలిసింది, ఏయే ప్రాంతాలకు వెళ్లింది. అసలు ఆమె పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, పాకిస్థాన్‌తో సంబంధాలున్న వ్యక్తికి కేరళ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్పెట్ పరిచింది అంటూ సురేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
'మిస్ వరల్డ్ 2025' విజేత విజయ రహస్యమేంటో తెలుసా? 
 
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిన థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. హైదరాబాద్ నగర వేదికగా ఈ పోటీలు జరగగా, శనివారంరాత్రి ఫైనల్ జరిగింది. ఈ అందాల పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన సక్సెస్ సీక్రెట్‍‌ను బహిర్గతం చేశారు. పట్టుదల, దృఢ నిశ్చయం అనేవే తన జీవితంలో కీలకమైన సూత్రాలన్నారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, కరుణ అనేవి తన వృత్తి జీవితానికి వెన్నెముక వంటివన్నారు. 
 
అలాగే, ఎపుడూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మౌలిక విలువలకు కట్టుబడి ఉండండి. నా లక్ష్యాన్ని పట్టుకుని, నన్ను నేను నమ్ముకున్నందువల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా మర్చిపోవద్దు అని సుచాత హితవు పలికారు.  
 
ఇది ఎపుడూ సులువుకాదు. కొన్నిసార్లు అలసటగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ మీరు ఎపుడూ వదిలిపెట్టకపోతే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడకి తప్పకుండా చేరుకుంటారు అని ఆమె వెల్లడించారు. 
 
కాగా, ఈ పోటీల్లో రన్నరప్‌గా ఇథియోపియాకు చెందిన హసెట్ అడ్మాసు నిలిచారు. కిరీట ధారణ వేడుక కోసం సుచాత, ఓపల్ రత్నాల వంటి పూలతో అలంకరించిన తెలుపు రంగు గౌను ధరించారు. ఈ గౌను హీలింగ్, బలానికి ప్రతీకగా నిలిచింది. కాగా, గత యేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా, కొత్త ప్రపంచ సుందరి ఓపల్ సుచాతకు కిరీటధారణ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments