Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ మంత్రి కుమారుడు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (11:02 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కుమారుడు ఒకరు తుపాకీతో రెచ్చిపోయాడు. తన ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో అనేకమంది పిల్లలు ఆటలు ఆడుకోవడం మంత్రి తనయుడుకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో తుపాకీతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అలాగే, తన సిబ్బందితో కలిసి చేతికి చిక్కినవారిని గొడ్డును బాదినట్టు బాదాడు. 
 
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన వెస్ట్ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో బీహార్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్న నారాయణ ప్రసాద్ సాహ్ ఇల్లు ఉంది. 
 
ఈ ఇంటి పక్కనే పెద్ద మామిడి తోట ఉండగా, ఇక్కడ ఆ గ్రామానికి చెందిన పిల్లలంతా కలిసి ఆడుకుంటుంటారు. అయితే, ఈ మామిడి తోటలో ఆటలు ఆడుకోవడానికి వీల్లేదని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్ హుకుం జారీచేశాడు. ఇందుకు పిల్లలు నిరాకరించడంతో తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments