Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎన్నికల ఫలితాలు : "గ్రాండ్" విక్టరీ దిశగా ఆర్జేడీ - కాంగ్రెస్ కూటమి!

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (09:19 IST)
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలకిందులయ్యేలా ఉన్నాయి. ఎన్డీయే, మహా ఘటబంధన్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ సాగిందని, మెజారిటీకి అవసరమైన సీట్లకన్నా కనీసం 10 నుంచి 15 అధిక సీట్లను ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి సాధిస్తుందని పలు సంస్థలు అంచనాలు వేయగా, ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్‌ను గమనిస్తే, ఆర్జేడీ ఘన విజయం దిశగా సాగుతోందనిపిస్తోంది.
 
మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్‌లో 185 స్థానాల తొలి దశ కౌంటింగ్ పూర్తి కాగా, ఎన్డీయే 92 స్థానాల్లో, మహా ఘటబంధన్ 101 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. ఎల్జేపీ ఐదు, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, సీఎం అభ్యర్థి తేజస్వితో పాటు ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్, పలువురు మహా ఘటబంధన్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 122 సీట్లు కావాల్సివుంది. ఈ సీట్లను మహా కూటమి సులభంగా సాధించే దిశగా ఈ ట్రెండ్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 125 సీట్లు రాగా, మహా కూటమికి 110, ఎల్జేపీకి 2, ఇతరులకు ఆరు సీట్లు వచ్చాయి. ఇపుడు ఈ ఫలితాలు అలాగే తిరగబడ్డాయి. ఫలితంగా మహా కూటమి 103 చోట్ల ఎన్డీయే 96 చోట్ల, ఎల్జేపీ ఆరు చోట్ల, ఇతరులు 5 చోట్ల ఆదిక్యంలో ఉన్నారు. మరో 33 స్థానాలు ట్రెండ్స్ తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments