Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోశ పార్శిల్‌లో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్ యజమానికి షాక్

Webdunia
గురువారం, 13 జులై 2023 (17:18 IST)
మసాలా దోస పార్శిల్‌లో సాంబార్‌ ఇవ్వలేదని రెస్టారంట్‌ యజమానిపై ఓ కస్టమర్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరిపిన కమిషన్ ఆ రెస్టారెంట్ యజమానికి రూ.3,500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్‌కు చెందిన మనీష్‌ పాఠక్‌ అనే న్యాయవాది టిఫిన్‌ కోసం తన తల్లితో కలసి హోటల్‌కు వెళ్లారు. రూ.140 వెచ్చించి స్పెషల్‌ మసాలా దోసెను పార్శిల్‌ తీసుకున్నారు. కానీ, ఇంటికి వెళ్లి చూసే అందులో సాంబార్‌ లేదు కేవలం దోసె, చట్నీ మాత్రమే ఉంది. మనీష్‌ ఆ విషయం చెప్పేందుకు మరుసటి రోజు అదే రెస్టారెంట్‌కు వెళ్లారు. సాంబార్‌ ఇవ్వటం మరచిపోయారని ఆ వ్యక్తి చెబితే.. 'ఏంటి, రూ.140తో హోటల్‌ మొత్తంగా కొంటావా' అంటూ మేనేజర్‌ హేళనంగా మాట్లాడాడు. 
 
ఈ వ్యాఖ్యలను అవమానంగా భావించిన సదరు కస్టమర్ ఒక న్యాయవాది ద్వారా రెస్టారెట్టి యాజమాన్యానికి నోటీసులు పంపారు. నోటీసులకు యాజమాన్యం స్పందించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. 11 నెలల విచారణ అనంతరం రెస్టారంట్‌దే తప్పని కోర్టు నిర్ధారిస్తూ, ఏకంగా రూ.3,500 జరిమానా విధించింది. 
 
కస్టమర్‌ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.2వేలు, లిటిగేషన్‌ ఛార్జీలు కింద వెయ్యి రూపాయలు ఫైన్‌ వేసింది. ఈ డబ్బును 45 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే 8 శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments