Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్‌ లేదు.. మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టుకెళ్లిన బంధువులు...

ఆంబులెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఓ చోట భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుని కిలోమీటర్లు నడిచాడో వ్యక్తి. మరో చోట ఓ తల్లి మృతదేహాన్ని విరగ్గొట్టి, మూటగట్టి తీసుకెళ్లారు అక్కడ సిబ్బంది. ఇలాంటి అమానవీయ ఘటనలు మ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:38 IST)
ఆంబులెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఓ చోట భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుని కిలోమీటర్లు నడిచాడో వ్యక్తి. మరో చోట ఓ తల్లి మృతదేహాన్ని విరగ్గొట్టి, మూటగట్టి తీసుకెళ్లారు అక్కడ సిబ్బంది. ఇలాంటి అమానవీయ ఘటనలు మరవకముందే.. బీహార్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఆంబులెన్స్‌ లేదని చెప్పడంతో మృతదేహాన్ని బంధువులు ప్లాస్టిక్‌ బ్యాగులో చుట్టుకుని తీసుకెళ్లారు. 
 
కతిహార్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సింతు కుమార్‌ అనే వ్యక్తి మృతిచెందడంతో పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని కతిహార్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు బంధువులు. మృతదేహానికి తాము శవపరీక్ష చేయలేమని, భగల్‌పూర్‌కు తీసుకెళ్లాలని ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆంబులెన్స్‌ సదుపాయం కావాలని బంధువులు ఆసుపత్రి సిబ్బందిని కోరారు. దీనికి సిబ్బంది నిరాకరించారు. 
 
దీంతో ఏం చేయాలో తెలీక...బంధువులు మృతదేహాన్ని ప్లాస్టిక్‌ బ్యాగులో చుట్టుకుని భగల్‌పూర్‌కు తరలించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో స్థానికంగా వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కతిహార్‌ సివిల్‌ సర్జన్‌ ఎస్‌సీ ఝా మాట్లాడుతూ.. మృతదేహం చాలా వరకు కుళ్లిపోవడంతో శవపరీక్ష చేసేందుకు అవసరమైన అధునాతమైన సదుపాయాలు తమ వద్ద లేవని, అందుకే భగల్‌పూర్‌కు వెళ్లమని చెప్పినట్లు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments