Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎఫెక్టు : పుట్టింటిలో భార్య.. రెండో పెళ్ళి చేసుకున్న భర్త.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి మే నెల 3వ తేదీ వరకు మొత్తం 40 రోజుల పాటు ఇది కొనసాగనుంది. అప్పటివరకు అత్యవసర సేవలు మినహా దేశం మొత్తం పూర్తిగా లాక్‌డౌన్ అయింది. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ ఓ మహిళకు కష్టాలు తెచ్చిపెట్టగా, ఆమె భర్త మాత్రం మరో పెళ్లి చేసుకునేందుకు దోహదపడింది. లాక్‌డౌన్ కారణంగా పుట్టింటిలో భార్య చిక్కుకుని పోయింది. అయితే, భార్య కాపురానికి రావట్లేదని ఆరోపిస్తూ ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపంలోని పాలీగంజ్ ప్రాంతానికి చెందిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తికి దుల్హిన్ బజార్‌కు చెందిన ఓ యువతితో ఇటీవలే వివాహమైంది. 
 
కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉండిపోవాల్సి నిర్బంధ పరిస్థితి వచ్చింది. అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. 
 
కానీ, ఆమె వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... వచ్చేందుకు వాహనాలు లేకపోవడం, పోలీసుల ఆంక్షలతో ఆ యువతి భర్త వద్దకు రాలేకపోయింది. దాంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ కుమార్ తన భార్యపై కోపంతో మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. 
 
దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments