Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్బర్ షాపులో పనిచేసే వ్యక్తి ఆ పని చేశాడని.. ఉమ్మిని నాలుకతో.. చెప్పులతో?

బార్బర్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంటి బయట ఉమ్మేశాడని.. తలుపు తట్టకుండా లోపలికి వెళ్లాడనే ఉద్దేశంతో.. ఆ వ్యక్తి నేలపై ఉమ్మేసిన ఉమ్మిని అతడి నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన అమానవీయ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:24 IST)
బార్బర్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంటి బయట ఉమ్మేశాడని.. తలుపు తట్టకుండా లోపలికి వెళ్లాడనే ఉద్దేశంతో.. ఆ వ్యక్తి నేలపై ఉమ్మేసిన ఉమ్మిని అతడి నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందా జిల్లాలో ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు.. బార్బర్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి ఖైనీ కోసం పొరిగింటిలో నివసించే సర్పంచ్ సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ బయట ఉమ్మి వేశాడు. తలుపు కొట్టకుండా లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఇంట్లో పురుషులు కూడా ఎవరూ లేకపోవడంతో అతను దురుద్దేశంతోనే వచ్చాడని అందరూ భావించారు. 
 
ఈ ఘటనపై పంచాయతీ జరిగింది. సురేంద్రయాదవ్ బాధితుడిని మహిళల చెప్పులతో కొట్టించాడు. అనంతరం ఘటనా స్థలానికి తీసుకెళ్లి వేసిన ఉమ్మిని నాలుకతో నాకించినట్టు బీహార్ షరీఫ్ ఎస్‌డీఓ సుధీర్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నంద్ కిషోర్ యాదవ్ ఇటువంటి వాటిని సహించబోమని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments