Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (15:01 IST)
బీహార్ రాష్ట్రంలోని సుపాల్‌ జిల్లాలో ఓ దారుణం జరిగింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని పట్టుకుని చితకబాది, బలవంతపు పెళ్లి చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జీవచ్ఛాపూర్‌కు చెందిన మిథిలేశ్ కుమార్ ముఖియా (24)కు తన మేనమామ శివచంద్ర ముఖియా భార్య రీటా దేవితో అక్రమ సంబంధం ఉందని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిథిలేశ్‌ను కిడ్నాప్ చేసి శివచంద్ర ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ శివచంద్రతో పాటు మరికొందరు గ్రామస్థుల కలిసి మిథిలేశ్‌పై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఆ తర్వాత రీటా దేవిని కూడా అక్కడకి తీసుకొచ్చి కొట్టారు. ఆ తర్వాత మిథిలేశ్‌తో ఆమెకు బలవంతంగా తాళి కట్టించి, పాపిటలో సింధూరం పెట్టించి పెళ్లి చేశారు. అడ్డుకోబోయిన తమపైనా దాడి చేశారని మిథిలేశ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకోగానే గ్రామస్థులంతా పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు శివచంద్ర ముఖియతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments