బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:57 IST)
బీహార్ రాష్ట్రంలో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజూ పెరుగుతుంది. శుక్రవారానికి ఈ సంఖ్య 32కు చేరుకుంది. మరికొంతమంది కల్తీసారా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఈ కల్తీసారా ఘటన కలకలం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
ఈ నెల 15వ తేదీన బీహార్ రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో తొలుత 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు ఈ సంఖ్య 35కు చేరుకుంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సివాన్ జిల్లాలోనే మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ 20 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అమితేష్ కుమార్ వెల్లడించారు. మరో 15 మంది వరకు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 
 
సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పది మందికిపైగా చనిపోయినట్టు చాప్రా పట్టణం ఎస్పీ కుమార్ అషిశ్ వెల్లడించారు. సివాన్, సారణ్ జిల్లాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఎందుకంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments