Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ రికవరీ ఏజెంట్‌తో ప్రేమ - పెళ్లి.. తాగుబోతు భర్తకు అలా షాకిచ్చిన భార్య.. (Video)

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (09:12 IST)
నిత్యం మద్యంసేవించి ఇంటికి వచ్చి వేధిస్తున్న భర్తకు ఓ భార్య తగిన విధంగా గుణపాఠం చెప్పింది. కట్టుకున్న భర్తకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంది. లోన్ సొమ్మును వసూలు చేసేందుకు ఇంటికి వచ్చే బ్యాంకు ఏజెంటుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా, ఈ పెళ్లికి ఇరుగుపొరుగువారితో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి, వారందరి సమక్షంలో తాను ఇష్టపడిన వ్యక్తితో తాళికట్టించుకుంది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాట్నాకు చెందిన ఇంద్రకుమారి అనే మహిళకు నకుల్ శర్మ అనే వ్యక్తితో గత 2022లో వివాహం జరిగింది. అయితే, నకుల్ శర్మకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ వేధింపులను భరించలేని ఇంద్రకుమారి తన తల్లిదండ్రులకు తన పరిస్థితిని వివరిస్తూ వచ్చింది. కానీ, వారుమాత్రం సర్దుకునిపోతూ సంసార జీవితాన్ని గడపాలని సూచించారు. అయితే, ఇంద్రకుమారి మాత్రం నకుల్ శర్మతో ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. 
 
ఈ క్రమంలో నకుల్ శర్మ బ్యాంకు లోను తీసుకోగా, ఆ డబ్బులను వసూలు చేసేందుకు ఇంటికి వచే పవన్ కుమార్ యాదవ్‌తో ఇంద్ర కుమారికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారి మధ్య ప్రేమకు దారితీసింది. పవన్ వద్ద తన గోడును ఇంద్ర కుమారి వెళ్లబోసుకుంది. పైగా, తన భర్తతో కలిసివుండలేనని తెగేసి చెప్పింది. దీంతో పవన్, ఇంద్ర కుమారిలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజున ఇంద్రకుమారిని తనతో విమానంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న తన అత్త ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత పెళ్లిపత్రికలు ముద్రించి ఈ నెల 11వ తేదీన తన వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. 
 
ఈ వివాహానికి ఇంద్రకుమారి తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఆహ్వానించింది. ఈ విషయం కాస్త సంచలనం కావడంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ పెళ్లిని చూసేందుకు వచ్చారు. అయితే, ఇంద్రకుమారి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా, ఈ పెళ్లిని తన ఇష్టప్రకారం చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో వారు కూడా చేసేదేమిలేక వెనుదిరిగారు. కాగా, ఈ వివాహానికి సంబంధించిన వీడియో  ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments