Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ తాళికట్టాడు.. ఎందుకో తెలుసా?

బీహార్‌లో ఓ పెళ్లికొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ.. తాళికట్టాడు. ఎందుకంటే.. అతనిని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టించారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో ఓ ఇంజినీర్‌ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి..

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (11:49 IST)
బీహార్‌లో ఓ పెళ్లికొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ.. తాళికట్టాడు. ఎందుకంటే.. అతనిని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టించారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో ఓ ఇంజినీర్‌ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి.. ఓ అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేయించారు. స్టీల్ ప్లాంట్‌లో పని చేసే వినోద్ కుమార్‌ను వేడుకకు రావాలంటూ సురేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆహ్వానించాడు. అనుకున్నట్టుగానే పెళ్లికి వినోద్ కుమార్ అటెండయ్యాడు. 
 
ఆ వెంటనే వినోద్‌ను తమ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లిన సురేంద్ర.. తన చెల్లెలిని వివాహం చేసుకోవాలంటే బలవంత పెట్టాడు. కాదు కూడదంటే చంపేస్తానని తుపాకీతో గురిపెట్టాడు. తనను విడిచి పెట్టాలని వినోద్ ఎంత వేడుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. 
 
తలపై తుపాకి పెట్టి మరీ బెదిరించడంతో.. విధిలేని పరిస్థితుల్లో వినోద్ తాళి కట్టాడు. ఇది జరుగుతున్నంత సేపూ అతను ఏడుస్తూనే ఉన్నా.. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments