Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీశ్‌ను ఓడించిన కరోనా వైరస్ : జేడీయు అధికార ప్రతినిధి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (10:41 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి విజయం సాధించనుంది. అయితే, ఒక్కటంటే ఒక్క ఫలితాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి కేసీ త్యాగి ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రాథమిక దశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే, తాము ఆర్జేడీ చేతిలోనే లేక తేజశ్వి ప్రసాద్ యాదవ్ చేతిలోనే ఓడిపోలేదని... దేశాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి చేతిలో ఓడిపోతున్నామని సెలవిచ్చారు. 
 
కేవలం కరోనా వల్లే తాము వెనుకబడ్డామని త్యాగి చెప్పుకొచ్చారు. గత 7 దశాబ్దాలుగా బీహార్ క్షిణిస్తూ వచ్చిందని... దాని ప్రభావం కూడా ఇప్పుడు తమపై పడిందన్నారు. మరోవైపు బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆర్జేడీ ఉండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. 
 
తాజా ట్రెండ్స్ సరళి మేరకు.. ఎన్డీయే 119 చోట్ల, ఎంజీబీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఎల్జేపీ ఆరు స్థానాల్లో, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments