ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ మతబోధకుడు కేఏ పాల్ అమెరికా వీధుల్లో నానా హంగామా చేశాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో ఆయన అమెరికా వీధుల్లోకి వచ్చి నృత్యం చేశారు.
తాజాగా వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయభేరీ మోగించారు. ఈయనకు 290 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో అమెరికాలో జోడెన్ మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.
అదేసమయంలో గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ప్రకటించిన కేఏ పాల్.. ఆ తర్వాత ఆయనకు బద్ధ వ్యతిరేకిగా మారారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో జో బైడెన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ క్రమంలో బైడెన్ విజయభేరీ మోగించడంతో పాల్ అమెరికా వీధుల్లో బైడెన్ మద్దతుదారులతో కలిసి డాన్సులు వేశారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ, తాను గత ఏడాది కాలంగా ట్రంప్ ఓటమికోసం శ్రమిస్తున్నానని వెల్లడించారు.
ట్రంప్‌ను గతంలోనే హెచ్చరించానని, కానీ ట్రంప్ తన మాట వినలేదని తెలిపారు. ఆయనపై ఓ పుస్తకం కూడా రాసి ఎలుగెత్తానని వివరించారు. ఈ క్రమంలో ఆయన అమెరికాలోల వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. చూడు ట్రంప్... ఈ జనాన్ని చూడు అంటూ వ్యాఖ్యానించారు.