Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో పడిన బస్సు: 35 మంది మృతి

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో బస్సు పడిపోయిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ బస్సులో 65 మంది ప్రయాణీకులున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (14:03 IST)
బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో బస్సు పడిపోయిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ బస్సులో 65 మంది ప్రయాణీకులున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
కొంతమందికి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డారని వారు చెప్తున్నారు. మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని.. చెరువులో పడ్డ బస్సును బయటకు తీసేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
 
ఇకపోతే.. ఈ బస్సు ప్రమాదంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతులకు సంతాపం ప్రకటించిన సీఎం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments