Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్వెలిన్ హీమ్ ఇంట్లో పెంచుకున్న అనకొండలు కనిపించట్లేదట.. జడుసుకున్న జనం

సాధారణంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంపుడు జంతువుగా పెంచుకుంటుంటారు. కొంతమంది చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, కుందేళ్లను, తీసుకువచ్చి తమపిల్లలకు బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (13:56 IST)
సాధారణంగా ప్రతిఒక్కరు తమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంపుడు జంతువుగా పెంచుకుంటుంటారు. కొంతమంది చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, కుందేళ్లను, తీసుకువచ్చి తమపిల్లలకు బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నా-పెద్ద, పేద-ధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. 
 
కాని జార్జియాకు చెందిన జాక్వెలిన్ హీమ్ అనే మహిళ మాత్రం పెంపుడు జంతువుగా అనకొండలను పెంచుకుంటోంది. అయితే ఉన్నట్టుండి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న 14 అనకొండలు కనిపించడం లేదని..... వాటికి ఆచూకీ తెలిస్తే... వాటి సమాచారం మాకివ్వండి. వెతికి తీసుకొచ్చిన వారికి సరైన పారితోషికం ఇవ్వబడును'' అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో సంచలన ప్రకటన చేసింది. 
 
ఈమె బయటకు వెళ్లినప్పుడు అవన్నీ ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాయి. ఇంటికి వచ్చి చూసే సరికి అవి కనిపించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జాక్వలిన్ వెంటనే వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారమిచ్చింది. అంతేకాదు తన ఫేస్ బుక్ పేజ్‌‌లో కూడా తన పైథాన్ల గురించి పోస్ట్ చేసింది. తన అనకొండలు హానికరం కాదని.. మంచివని చెబుతోంది జాక్వలిన్. కానీ ఇరుగుపొరుగు మాత్రం భయంతో గజగజలాడుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments