Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ...

ఇంట్లో పనికి కుదుర్చుకున్న యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ అతని కళ్లలో యాసిడ్ పోశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (12:44 IST)
ఇంట్లో పనికి కుదుర్చుకున్న యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ అతని కళ్లలో యాసిడ్ పోశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సమస్తిపూర్ జిల్లాకు చెందిన బాధితుడు బరౌనీ గ్రామంలో ఓ భూస్వామి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనికి చేరాడు. ఈ క్రమంలో యజమాని భార్యతో డ్రైవర్‌కు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం యజమానికి తెలిసింది. దీంతో ఆయన జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీన వారిద్దరూ కలసి పారిపోగా, అతనిపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఆపై ఆమె 16వ తేదీన కోర్టు ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వగా, భర్తతో కలసి వెళ్లాలని కోర్టు సూచించింది. ఆపై భర్త వద్దకు వచ్చిన తర్వాత కూడా, తాను డ్రైవర్‌తోనే ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయమై వారి కుటుంబంలో గొడవ కూడా జరిగింది.
 
ఈ నేపథ్యంలో శనివారం నాడు హోటల్‌లో ఉన్న బాధితుడిని బయటకు లాక్కొచ్చిన సదరు భూస్వామి బావమరిది, మరికొందరు ఆయన కళ్లల్లో ఓ సిరంజి సాయంతో యాసిడ్ పోశారు. తీవ్రంగా కొట్టారు. ఆపై హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పోయారు. స్థానికులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా, చూపు పోయినట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments