Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వదినతో సుఖం కోసం ఫ్లైట్‌లో వచ్చి అన్నను హతమార్చాడు...

వదినతో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ కూడా... బీహార్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చిమరీ చంపేశాడు.

వదినతో సుఖం కోసం ఫ్లైట్‌లో వచ్చి అన్నను హతమార్చాడు...
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (10:36 IST)
వదినతో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ కూడా... బీహార్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చిమరీ చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
 
బీహార్‌ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్‌కు చెందిన జయ్‌మంగళ్‌దాస్‌ (35) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఈయన ఫతేనగర్‌లోని పైపులైను కాలనీలో నివాసముంటున్నాడు. భార్యా పిల్లలు మాత్రం బీహార్‌లోనే ఉంటున్నారు. 
 
అయితే, వీలు దొరికినప్పుడల్లా స్వగ్రామంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. రానుపోను ప్రయాణ భారం తదితర సమస్యల వల్ల పిల్లలను తీసుకుని నగరానికి వచ్చేయాలని భార్యకు చెప్పాడు. దీంతో భార్య మాలతీదేవి పిల్లలతో కలిసి నగరానికి వచ్చేసింది. మాలతీదేవి ఇబ్రహీంపూర్‌లో ఉన్నప్పుడు తనకు మరిది వరుసయ్యే నీరజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భర్త దగ్గరికి చేరుకున్నా కూడా ప్రతీ రోజు ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న భర్తను కడతేర్చేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం తన ప్రియుడిని పాట్నా నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో రప్పించింది. 
 
ఆ తర్వాత భర్తకు పీకల వరకు మద్యం తాపించగా, నిద్రమత్తులోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించి భర్త మెడకు ఇనుప వైరు బిగించి చంపేసింది. మరుసటి రోజు నీరజ్‌కుమార్‌ మళ్లీ పాట్నాకు వెళ్లిపోయాడు. అయితే, పోలీసుల దృష్టి మళ్లించేందుకు తన చావుకు ఆర్థిక సమస్యలే కారణమని పేర్కొంటూ భోజ్‌ఫురి భాషలో సూసైడ్ లేఖను రాసిపెట్టింది. 
 
దీంతో పోలీసులు తొలుత ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మెడకు ఉరిబిగించి చంపేసినట్టు తేలడంతో పోలీసులు ఆరా తీశారు. మాలతీదేవి కాల్ డేటాను పరిశీలించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజయ్యను రాజీవ్ అవమానిస్తే.. చంద్రబాబును మోడీ అవమానించలేదా?