Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ సెంటర్‌కు అనుకోని అతిథి.. కరోనా అని వస్తే.. కాలనాగు వచ్చిందేంటి?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (16:24 IST)
snake
క్వారంటైన్ సెంటర్‌కు అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథిని చూసి హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరగిందంటే..? క్వారంటైన్ సెంటర్‌కు కాలనాగు వచ్చింది. ఆరు అడుగుల పొడవున్న నాగుపాము ఆ క్వారంటైన్ సెంటర్లోకి వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ.. వెంటనే నిర్వాహకులు స్నేక్ హెల్ప్ నిర్వాహకులకు కాల్ చేశారు. 
 
హుటాహుటిన బాలాకటి క్వారంటైన్ సెంటర్‌కు చేరుకున్న స్నేక్ హెల్ప్ సిబ్బంది ఆ పామును చాకచక్యంగా పట్టుకొని తీసుకెళ్లారు. అసలే కరోనాకు భయపడుతుంటే... ఇలా పాములు కూడా రావడం ఏంటని కరోనా పేషెంట్లు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లో చోటుచేసుకుంది. 
 
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లలో అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. టెస్టులు నిర్వహించి నెగెటివ్ వస్తే ఇంటికి పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments