Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలోనే భారత్‌ బయోటిక్‌ వ్యాక్సిన్‌!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (08:28 IST)
కొవాగ్జిన్‌ టీకా వచ్చే ఏడాది మార్చి తర్వాత అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసిఎంఆర్‌ అంచనా వేసినప్పటికీ, మొదటి రెండు దశల ఫలితాలు ఆశాజనంగా ఉండడంతో.. వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసిఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త రజనీకాంత్‌ అన్నారు.

కరోనా వైరస్‌ నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఫిబ్రవరిలోనే రానుంది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 

మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని అన్నారు. మూడోదశ ప్రయోగాలు కాకముందే వ్యాక్సిన్‌ అందజేస్తారా అన్న ప్రశ్నకు దీనిపై ఐసిఎంఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఫేజ్‌ ా1, ఫేజ్‌ా2 ప్రయోగాల్లోనూ, జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. అయితే, మూడోదశ ఫలితాలు పూర్తికాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేమన్నారు.

అత్యవసర వినియోగంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని రజనీకాంత్‌ అన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అంశంపై భారత్‌ బయోటెక్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments