Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘ఆపరేషన్‌ మేరీ సహేలి’ని ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

‘ఆపరేషన్‌ మేరీ సహేలి’ని ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
, శుక్రవారం, 6 నవంబరు 2020 (08:04 IST)
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ప్రయాణించే మహిళ ... ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళ భద్రత కోసం ‘‘మేరీ సహేలి’’ పేరిట ప్రత్యేక చర్యు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైలు ప్రయాణంలో మహిళా ప్రయాణికుకు పూర్తి భద్రతను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే 08 ప్రధాన రైళ్ళను గుర్తించి మహిళా ప్రయాణికులను భద్రతరీత్యా చైతన్యవంతం చేసే దిశగా ‘‘మేరీ సహేలి’’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్ల వద్ద సబ్‌ ఇన్స్‌పెక్టర్లు / సిబ్బందితో కూడిన మహిళా రైల్వే భద్రతా దళం(ఆర్‌పిఎఫ్‌) మహిళా ప్రయాణికుతో మాట్లాడడం జరుగుతుంది.

ప్రత్యేకంగా చేపట్టబడుతున్న ఈ కార్యక్రమా సందర్భంగా, ప్రయాణ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త గురించి తొపడమే కాకుండా అత్యవసర సమయాల్లో 182 నెంబరుకు ఫోన్‌ చేయాల్సిందిగా సూచించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా, ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది, మహిళు ప్రయాణించే సీట్ల నెంబర్లను సేకరించి మార్గమధ్యంలో రౖుె ఆగే స్టేషన్లను గురించి వారికి సమాచారమివ్వడం జరుగుతుంది.

మార్గమధ్యంలో రైలు ఆగే స్టేషన్లలో ప్లాట్‌ఫాం పై విధును నిర్వర్తించే ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది మహిళ ప్రయాణిస్తున్న బోగీలు మరియు బెర్త్‌ పై దృష్టిని కేంద్రీకరించడంతో పాటుగా అవసరమనుకున్న పక్షంలో మహిళా ప్రయాణికుతో సంభాషించడం జరుగుతుంది. అంతేకాకుండా, ప్రయాణ సమయంలో విధు నిర్వహణలో ఉండే ఆర్‌పిఎఫ్‌/ఆర్‌పిఎస్‌ఎఫ్‌ సిబ్బంది అన్ని బోగీను / గుర్తించబడిన బెర్తును గమనించడం జరుగుతుంది.

గమ్యస్థానానికి చేరిన మీదట ఆర్‌పిఎఫ్‌ బృందాు మహిళా ప్రయాణికుతో సంభాషించి వారి నుండి సలహాలు/సూచనలు సేకరించడం జరుగుతుంది. ‘‘మేరీ సహేలి’’ సదుపాయం ఉన్న రైళ్ళలో ప్రయాణించే మహిళా ప్రయాణికు నుండి సహాయం కోరుతూ ఏదేని ఫోన్‌ వచ్చిన పక్షంలో, సదరు కాల్‌ డివిజన్‌కు సంబంధించిన సీనియర్‌ ఉన్నతాధికారు ద్వారా పరిశీలించబడి పరిష్కార దిశగా తగు చర్యు చేపట్టబడతాయి. ‘‘మేరీ సహేలి’’ సదుపాయం అము చేయబడుతున్న రైళ్ళ వివరా ఈ క్రింద ఇవ్వబడినవి.
 
(1) 07202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ నుండి గుంటూరు వరకు (2) 02778 గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ నుండి విశాఖపట్నం వరకు (3) 02793 రాయసీమ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుండి నిజామాబాద్‌ వరకు (4) 02715 సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌, హెచ్‌.ఎస్‌. నాందేడ్‌ నుండి అమృత్‌సర్‌ వరకు (5) 01142 నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌, కిన్వట్‌ నుండి సిఎస్‌ఎంటి వరకు (6) 07201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు నుండి సికింద్రాబాద్‌ వరకు (7) 07225 అమరావతి ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ నుండి హుబ్బళి వరకు (8) 02785 మైసూరు ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ నుండి మైసూరు వరకు.
ఇంతేకాకుండా, పైన తొపబడిన రైళ్ళకు అదనంగా, దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణించే ఇతర జోన్లకు చెందిన ‘‘మేరీ సహేలి’ సదుపాయం గ రైళ్ళను కూడా మన జోన్‌ యొక్క ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది పరిశీలిస్తారు.

 
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు గజానన్‌ మ్యా, ‘‘మేరీ సహేలి’’ కార్యక్రమం క్రింద మహిళా ప్రయాణికు భద్రత కోసం రైల్వే భద్రతా దళం చేపడుతున్న ప్రచార కార్యక్రమాను, ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికు తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తను గురించి అవగాహనను కల్పించడాన్ని ప్రశంసించారు.

మహిళా ప్రయాణికు భద్రత కోసం చేపట్టాల్సిన చర్యకు ప్రాధాన్యత ఇవ్వాని ఆయన అన్నారు. ఎవరేని మహిళా ప్రయాణికురాలి నుండి సహాయం కోరుతూ ఫోన్‌ కాల్‌ వచ్చినట్లయితే ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై వారి భద్రత కోసం తగు చర్యను చేపట్టాని మరియు నిందితును గుర్తించి చర్యు చేపట్టాని ఆయన సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్నబ్‌ డబ్బులివ్వకపోవడంతో నా భర్త, అత్తమ్మలు ఆత్మహత్య: ఇంటీరియర్‌ డిజైనర్‌ భార్య వెల్లడి