Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న భారత్ బంద్ : పిలుపునిచ్చిన కిసాన్ మోర్చా.. మద్దతిచ్చిన వైకాపా

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (19:42 IST)
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. ఈ చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు సూచించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ నిరసనను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. అన్ని రంగాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.
 
మరోవైపు, ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. 
 
అలాగే, ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. 
 
27న మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఏపీలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 27న భారత్ బంద్‌కు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ విజయవంతం చేయాలనీ, ప్రతి కార్యకర్త, అభిమాని పాల్గొనాలనీ పిలుపు నిచ్చాయి తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ కమిటీలు. టీడీపీ కూడా భాగస్వామ్యం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments