Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమెరాకు చిక్కకుండా పెద్దపులి జాగ్రత్తలు!

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (07:21 IST)
నల్లమల అడవుల్లో రెండు పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 20 పెద్ద పులులు ఉండగా.. వీటికి రెండు పిల్లలు తోడయ్యాయి. వీటిని పర్యవేక్షించేందుకు అటవీశాఖ 45 కెమెరాలు అమర్చింది.

ప్రమాదం ఉంటుందేమోనని పెద్దపులి పిల్లల్ని కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అటవీశాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ 20 పెద్ద పులులు ఉండగా.. వీటికి రెండు పులి పిల్లలు జత కలిశాయి.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రకృతి పర్యాటక ప్రాంతమైన ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్రాంతంలో తల్లి పులితో కలిసి రెండు పులి పిల్లలు సందడి చేస్తున్నాయి. ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్రాంతంలో తల్లి పులి ఎక్కువగా కన్పిస్తున్న కారణంగా.. అటవీశాఖ దానికి ‘ఫర్హా’ అనే పేరు పెట్టింది.

ఏడాది క్రితం దీనికి పుల్లాయిపల్లి బేస్‌క్యాంప్‌ ప్రాంతంలో రెండు పిల్లలు పుట్టాయి. అక్కడ బౌరమ్మ గుడి ఉంది. దీంతో మగ పులికూనకు పుల్లయ్యగా, ఆడ కూనకు బౌరమ్మగా నామకరణం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు అటవీశాఖ 45 కెమెరాలు అమర్చింది.

కొన్నాళ్లపాటు కెమెరాల కంటపడిన అవి.. తర్వాత కన్పించకపోయేసరికి అధికారులు కలవరపడ్డారు. కెమెరాల ముందు ఏదైనా జీవి కదిలితే ఫ్లాష్‌ వచ్చి ఆ చిత్రం నిక్షిప్తమవుతుంది. ఫ్లాష్‌ను చూసి ఏదో ప్రమాదం ఉందన్న భావనతో పెద్దపులి.. పిల్లలు కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments