బెంగళూరుకు చెందిన 29 యేళ్ళ మ్యూజీషియన్ కరణ్ జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని సబర్బన్ బాంద్రాలో ఎత్తయిన భవనం 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లోక్ రోడ్‌లో కరణ్ స్నేహితుడు రిషీష
బెంగళూరుకు చెందిన 29 యేళ్ళ మ్యూజీషియన్ కరణ్ జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని సబర్బన్ బాంద్రాలో ఎత్తయిన భవనం 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లోక్ రోడ్‌లో కరణ్ స్నేహితుడు రిషీషా నివసిస్తున్నాడు. అతడి వద్దే కరణ్ గత నెలరోజులుగా ఉంటూ వచ్చాడు.
గత కొన్ని రోజులుగా తీవ్ర మానసికఒత్తిడిలో ఉన్న కరణ్... ఆదివారం తన స్నేహితులతో కలిసి టీవీ చూస్తున్నాడు. కిటీకీ దగ్గరకు వెళ్లిన కరణ్ అందులోంచి ఉన్నట్టుండి కిందకి దూకేశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కరణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో కరణ్ మద్యం సేవించివున్నట్టు సీనియర్ పోలీసు అధికారి పండిట్ ఠాక్రే చెప్పారు. కరణ్‌ను సమీప దవాఖానాకు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ దొరుకలేదని పోలీసులు చెప్పారు. కాగా, దేశంలో ఉన్న ప్రసిద్ధ మ్యూజీషియన్లలో ఒకడైన కరణ్ జోసెఫ్ ఎంటీవీలో పెంటాగ్రామ్ బ్యాండ్ తరపున అనేక ప్రదల్శనులు ఇచ్చి గుర్తింపు కూడా పొందాడు.