Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి కాలేజీ ఫీజు చెల్లిస్తుంటే.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్... ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో చదువుకునే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కింది అంతస్తులో తండ్రి ఫీజులు చెల్లిస్తుంటే.. పై అంతస్తు నుంచి కిందికి

Advertiesment
Narayana Junior College
, గురువారం, 10 ఆగస్టు 2017 (09:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో చదువుకునే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కింది అంతస్తులో తండ్రి ఫీజులు చెల్లిస్తుంటే.. పై అంతస్తు నుంచి కిందికి దూకి ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌, బండ్లగూడలోని నారాయణ కళాశాలలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన పబ్బు వెంకటేశం, దుర్గమ్మల రెండో కుమార్తె శ్రావ్య (16) నాగోల్‌ సమీపంలోని బండ్లగూడలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ కోర్సు చేస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వెళ్లింది. అక్కడ ఆనందంగా గడిపిన శ్రావ్యను తండ్రి కళాశాలకు తీసుకొచ్చాడు. ఫీజుకట్టాల్సి ఉండటంతో తండ్రి కింది అంతస్తులోని ఫీజు కౌంటర్‌ వద్దకు వెళ్లాడు.
 
అక్కడ సిబ్బంది లేకపోవడంతో సుమారు 40 నిమిషాలు వెంకటేశం అక్కడే ఉండిపోయాడు. ఇంతలో కళాశాల ఆవరణలోకి అంబులెన్సు రావడాన్ని గమనించి ఎవరికో బాలేదోమోనని అందర్లాగే వెంకటేశం కూడా ఆసక్తిగా గమనించాడు. ఇంతలో కళాశాల సిబ్బందితో కలిసి విద్యార్థినులు ఒక బాలికను అంబులెన్స్‌లోకి ఎక్కించడం చూసి పరుగున వెళ్లాడు. చూస్తే ఆ బాలిక తన కుమార్తె శ్రావ్య కావడంతో కన్నీరుమున్నీరయ్యాడు. 
 
ఆ తర్వాత ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణం విడించింది. దీంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో నారాయణ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలా బ్యూటీగా ఉన్నావ్.. నా కోర్కె తీరిస్తే హీరోయిన్‌గా ఛాన్సిస్తా...