Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలిక చేతిలో హతమైన తాగుబోతు టెక్కీ తండ్రి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 25 జులై 2020 (11:13 IST)
బెంగుళూరు నగరంలో ఓ తాగుబోతు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తండ్రి మైనర్ కుమార్తె చేతిలో హతమయ్యాడు. పీకలవరకు మద్యం తాగొచ్చి కన్నబిడ్డపై దాడి చేయబోయాడు. దీంతో ఆ బాలిక తిరగబడి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన ఆ తాగుబోతు టెక్కీ.. ప్రాణాలు విడిచాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈయన భార్య తొమ్మిదేళ్ళ క్రితం చనిపోయింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉండగా, కుమార్తె వయసు 15, కుమారుడు వయసు 9 యేళ్లు. 
 
అయితే, భార్య చనిపోయిన తర్వాత పిల్లలతో కలసి అతడు మీకో లేఅవుట్‌లో నివసిస్తూ వచ్చాడు. అయితే, పిల్లలకు చదువును ఇంట్లోనే ఓపెన్ స్కూలు విధానంలో చెప్పించసాగాడు. 
 
ఈ క్రమంలో మద్యం అలవాటు ఉన్న ఈ టెక్కీకి.. అపుడపుడూ మద్యం సేవించి వచ్చి.. పిల్లలను వేధించసాగాడు. ఈ క్రమంలో గత గురువారం మద్యం సేవించివచ్చి 15 యేళ్ల మైనర్ బాలికపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ యువతి తిరగబడి తండ్రిపై దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తండ్రి తనపై కత్తెరతో దాడిచేయబోతుంటే.. తాను ఎదురుదాడికి దిగానని, ఆ పెనుగులాటలో తండ్రికి తీవ్రగాయాలై చనిపోయాడని కూతురు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 
 
ఈ కేసులో నిందితురాలు బాలిక మైనర్ కావడంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ బాలల సంరక్షణాలయానికి తరలించారు. ఆమె చెబుతున్నది నిజమా కాదా తేల్చుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments