స్మార్ట్ ఫోన్లు, కెమెరాల ఉపయోగం బాగా పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాల వల్ల లాభాలెన్నో వున్నప్పటికీ నష్టాలు కూడా అంతే వున్నాయి. కెమెరాలను పక్కింటి బాత్రూమ్‌లో ఫిక్స్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్
స్మార్ట్ ఫోన్లు, కెమెరాల ఉపయోగం బాగా పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్లు, కెమెరాల వల్ల లాభాలెన్నో వున్నప్పటికీ నష్టాలు కూడా అంతే వున్నాయి. కెమెరాలను పక్కింటి బాత్రూమ్‌లో ఫిక్స్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బనశంకర ప్రాంతంలోని మైకో లేఔట్ సార్వభౌమనగర్‌కు చెందిన జీవన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల తన పక్కింటి బాత్రూమ్‌లో సీక్రెట్‌గా కెమెరాను అమర్చాడు. అయితే బాత్రూమ్‌లో కెమెరాను వున్న సంగతిని గుర్తించిన పక్కింటి మహిళ భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీవన్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
రహస్యంగా కెమెరాలను అమర్చి నగ్నదృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి బెదిరించేందుకే ఇలా చేశానంటూ జీవన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.