Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో కొనసాగుతున్న కీచకపర్వం.. బాలికలను అడ్డుకుని లైంగిక దాడి..

బెంగళూరు నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నగరంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జరిగిన కీచకపర్వం ఇంకా చర్చల్లో నానుతుండగానే.. వరుసగా మహిళలపై లైంగిక

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (16:15 IST)
బెంగళూరు నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నగరంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జరిగిన కీచకపర్వం ఇంకా చర్చల్లో నానుతుండగానే.. వరుసగా మహిళలపై లైంగిక దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
 
ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను జనావాసం లేని ప్రదేశానికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి వారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. వయ్యాలి కావలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మునీశ్వర బ్లాక్‌కు చెందిన ఓ యువకుడు వయ్యాలి కావలి పోలీస్ స్టేషన్‌కు సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అడ్డుకుని లైంగిక దాడికి యత్నించాడు.
 
అదే యువకుడు.. అదే రోజు సాయంత్రం మరో ఇద్దరు బాలికల పట్ల కూడా అలాగే ప్రవర్తించాడు. కావలి 5వ మెయిన్ రోడ్డులో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులను బలవంతం చేశాడు. నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఘటనానంతరం బాధిత బాలికల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం