Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వాడే అమ్మాయిలా? వద్దే వద్దంటున్న యువకులు?

స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. యువకులు, యువతులు ప్రస్తుతం సోషల్ మీడియాపై మోజు పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను తెగ వాడే అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావ

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (11:27 IST)
స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. యువకులు, యువతులు ప్రస్తుతం సోషల్ మీడియాపై మోజు పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను తెగ వాడే అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావడం గగమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
కొన్ని సంవత్సరాల క్రితం అమ్మాయిని ఫిక్స్ చేసుకుని వరుడు కుటుంబీకులు.. అమ్మాయి గురించి పక్కనక్కన విచారించుకోవడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సోషల్ మీడియాను చూసి అమ్మాయి ఎలాంటిదో బేరీజు వేస్తున్నారు.

ఎందుకుంటే సోషల్ మీడియా వ్యసనంగా మార్చుకునే అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు యువకులు అంతగా ఆసక్తి చూపట్లేదట. ఈ విషయాన్ని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ ప్రకటనలు కూడా వస్తున్నాయని తేలింది. 
 
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్బాయిలు ఈ విషయం గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారట. అమ్మాయిలు ఫేస్ బుక్, వాట్సాప్‌లను అధికంగా వాడితే.. తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారట ఇప్పటికే ఫేస్‌బుక్‌, వాట్సాప్ వాడుతుండ‌టం వ‌ల్ల భ‌ర్త‌ను, పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేసే మహిళల సంఖ్య పెరిగిందని సర్వేలో తేలింది. 
 
అందుకే తాము మనువాడే అమ్మాయిలను ఎంచుకునే విషయంలో యువకులు అప్రమత్తంగా వున్నారని తెలుస్తోంది. సో అమ్మాయిలు ఇక సోషల్ మీడియా వాడకం పట్ల అప్రమత్తంగా వుండాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments