Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగ్రహంపై భార్యకు స్థలం కొనిపెట్టిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (21:53 IST)
చంద్రగ్రహంపై భార్యకు ఓ స్థలాన్ని కొనిపెట్టాడు.. ఆ భర్త. పెళ్లైన తొలిసారి భార్యకు బర్త్ డే రావడంతో భూమి మీద కాకుండా చంద్రునిపై భార్య కోసం నేల కొనిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. సంజయ్ మహతో పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌కు చెందినవాడు. 
 
పెళ్లికి ముందు చంద్రుడిని కానుకగా ఇస్తానని భార్యకు మాట ఇచ్చాడని సంజయ్ చెప్పాడు. చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత్‌ విజయవంతంగా దిగినందుకే ఇలాంటి బహుమతిని కొనుగోలు చేయాలనే కోరిక వచ్చిందని సంజయ్‌ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత, తన భార్యకు ఇచ్చిన హామీని నెరవేర్చగలననే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
 
"నా భార్య, నేను చాలా కాలంగా ప్రేమిస్తున్నాం. గత ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నాం. మా వివాహం తర్వాత ఆమె మొదటి పుట్టినరోజున, నేను ఆమెకు చంద్రునిపై ఒక స్థలాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను." అని సంజయ్ మహతో చెప్పారు.
 
తన స్నేహితుడి సహకారంతో లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ద్వారా చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసినట్లు సంజయ్ తెలిపాడు. దీనికి సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసేందుకు ఏడాది సమయం పట్టిందని తెలియజేశాడు. సంజయ్ మహోటా వద్ద భూమి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది.
 
2020లో రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి తన భార్యకు చంద్రుడిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. తన జయంతిని పురస్కరించుకుని తన భార్యకు చంద్రన్న భూమిని బహుమతిగా ఇచ్చానని చెప్పాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments