Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లితోనే అసభ్యంగా ప్రవర్తించిన బావమరిది... చంపే ముక్కలుగా నరికి...

Advertiesment
murder
, గురువారం, 31 ఆగస్టు 2023 (13:50 IST)
ముంబైలో దారుణ ఘటన జరిగింది. సొంత చెల్లితోనే అభభ్యంగా ప్రవర్తించిన బావమరిదిని బావ హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వంటగదిలో దాచిపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఫషిప్ షేక్ అనే వ్యక్తి తన భార్య తండ్రి పెరిగిన ఈశ్వర్ పుత్రన్‌ను హత్య చేశాడు. భార్యను హింసిస్తుండటంతో పలుమార్లు వారిద్దరి మధ్య గొడలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం మరోమారు గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన షేక్... ఈశ్వ‌ను హత్య చేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా కోసి వంటగదిలోనే దాచిపెట్టాడు. బాధితుడు కనిపించకపోవడంతో అతడి పెంపుడు తండ్రి లలిత్ పుత్రన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
చెంబూరులో గుర్రపు షెడ్డును నడుపుతున్న లలిత్, అతడి భార్య రేష్మకు ఐదుగురు కుమార్తెలు. 12 యేళ్ల క్రితం భార్య చనిపోయింది. దీంతో లలిత్ మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఒంటరిగా సంచరిస్తున్న బాలుడిని దత్తత తీసుకున్నారు. ఈశ్వర్ మార్వాడి అనే పేరును ఈశ్వర్ పుత్రన్‌గా మార్చారు. నాలుగేళ్ల క్రితం లలిత్ తన కుమార్తెల్లో ఒకరైన అమైరాను ఇచ్చి షేక్‌కు వివాహం చేశాడు. 
 
ఆ తర్వాత షేక్‌కు ఈశ్వర్‌కు మధ్య తరచుగా గొడవులు జరగడం ప్రారంభమయ్యాయి. షేక్, అమైరా దంపతులకు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే, యేడాది క్రితం తన భార్య అమైరాతో ఈశ్వర్‌ అసభ్యంగా ప్రవర్తించడం చూసి తట్టుకోలేక పోయాడు. అప్పటికే వార్నింగ్ ఇచ్చానని, అయినా తీరు మార్చుకోకపోవడంతో చంపేశానని పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జోహెన్స్‌బర్గ్‌ భవనంలో మంటలు.. 52మంది సజీవదహనం