Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా భక్తులకు లైంగిక వేధింపులు... పూజారిని నగ్నంగా చేసి...

భక్తిప్రపత్తులతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధించినందుకు ఓ పూజారిని నగ్నంగా చేసి ఊరేగించడమే కాకుండా బడితపూజ కూడా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో చోటుచేసుకున్న ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (07:28 IST)
భక్తిప్రపత్తులతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధించినందుకు ఓ పూజారిని నగ్నంగా చేసి ఊరేగించడమే కాకుండా బడితపూజ కూడా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో చోటుచేసుకున్న ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బెలగావి, షంబాజీ రోడ్‌లో కపిలేశ్వర ఆలయం ఉంది. ఇందులో పూజారి గోపాలయ్య(రామ పూజారి) పని చేస్తున్నారు. ఈయన కొన్ని నెలలుగా ఈ ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీనిపై పలువురు మహిళలు హెచ్చరించినా ఆయన తీరు మాత్రం మారలేదు. పైపెచ్చు మహిళా భక్తులను అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయసాగాడు. 
 
ఈ పరిస్థితుల్లో సాయంత్రం వేళ గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని చితకబాది ప్యాంట్‌ ఊడదీయించి ఊరేగించారు. ఆ సమయంలో ఆయన అనుచరులు దాడికి పాల్పడిన వారిపై యాసిడ్ దాడికి యత్నించారు. ఆ వీడియోలు స్థానికంగా పలు ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం