Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్ ఎక్స్ ఫీచర్స్‌తో ఎంఐ 8.. త్వరలో భారత్‌లోకి...

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన తాజా మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎంఐ8 పేరుతో దీన్ని రిలీజ్ చేసింది. ఐఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను తయారు చేయడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లలో ఇదో విప్లవం

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (07:06 IST)
చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన తాజా మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎంఐ8 పేరుతో దీన్ని రిలీజ్ చేసింది. ఐఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను తయారు చేయడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లలో ఇదో విప్లవం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
 
ఎందుకంటే.. లక్ష రూపాయల విలువ అయిన ఐఫోన్ ఎక్స్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయని.. డిస్ ప్లే లుక్ కూడా అలాగే ఉందని చెబుతున్నారు. చైనాలో గ్రాండ్‌గా ఈ ఫోన్ లాంఛింగ్ జరిగింది. జూన్ నెలాఖరులోపు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. 
 
ఫీచర్స్ ఎలా ఉన్నాయి..
ఎంఐ 8 డిస్ ప్లే 6.21 ఇంచ్. 88.81శాతం స్కీన్ డిస్ ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పని చేస్తోంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సల్, ఫోన్ వెనక 12 మెగాపిక్సల్ రెండు కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది. మన ఫేస్ ద్వారా ఫోన్ అన్ లాక్ ఆప్షన్ కూడా ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత ఇందులోనే ఈ తరహా ఆప్షన్ ఉంది. మన ముఖాన్ని 3డీ సెన్సార్ తోనే ఫొటోగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
 
ఇకపోతే, రెండు సిమ్స్ కార్డులు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా 4జీ ఓల్ట్‌తో పని చేస్తాయి. డ్యుయల్ బ్యాండ్ వైఫై ఉంది. 3400 ఎంఏహెస్ బ్యాటరీ. చార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఎంఐ8 ఎక్స్ ప్లోరర్ ఫోన్ చూసినా, ఫీచర్స్ విన్నా అచ్చం ఐఫోన్ ఎక్స్ గుర్తుకొస్తుంది అంటున్నారు. 
 
6 జీబీ ర్యామ్, 64జీపీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.28వేల 460గా నిర్ణయించారు. 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.31 వేల 620గా ఉంది. 256జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.34వేల 785గా ఉంది. అయితే ఐఫోన్ కావాలంటే లక్ష రూపాయలు పెట్టాలి.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అవే ఫీచర్స్‌లో ఎంఐ 8 మాత్రం అందుబాటులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments