Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. చెన్నైకి భారీ వర్ష సూచన.. దక్షిణ కోస్తా, సీమలోనూ వర్షాలు..

గత ఏడాది డిసెంబరులో భారీ వర్షాలు చెన్నై వాసులను చేదు అనుభవాన్ని మిగిల్చాయి. చెన్నై నగరంలో భారీ వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏర్పడింది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది మరింత

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (11:45 IST)
గత ఏడాది డిసెంబరులో భారీ వర్షాలు చెన్నై వాసులను చేదు అనుభవాన్ని మిగిల్చాయి. చెన్నై నగరంలో భారీ వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏర్పడింది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 830 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయిందమైందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 
 
ఈ వాయుగుండం పశ్చిమ దిశగా అది పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఇది తుపానుగా మారనుందని... దీని ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన కడలూరు సమీపంలో తుపాను తీరం దాటనుందని అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, కారైకల్ ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
 
అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు ప్రారంభం కానున్నాయి. తరువాత వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో అంటే వచ్చే నెల రెండు, మూడు తేదీల్లో కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి సోమవారానికి నెల గడిచింది. ఇప్పటివరకు వర్షాలు లేవు. ఈ సీజన్‌లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురంలో వర్షాలు కురవాల్సి ఉంది. అయినా.. చినుకు జాడ కరువవడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments