Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుకోలేని విధంగా తండ్రి వేధింపులు ... ఫ్రెండ్స్‌తో కలిసి మట్టుబెట్టిన కూతురు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (19:33 IST)
ఓ అబల తన స్నేహితులతో కలిసి కన్నతండ్రిని మట్టుబెట్టింది. బయటకు చెప్పుకోలేని విధంగా కన్నతండ్రి వేధించడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో తన స్నేహితులతో కలిసి మట్టుబెట్టుంది. ఈ ఘటన కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) అనే వ్యక్తి బెంగుళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. భార్య చనిపోవడంతో తన ముగ్గురు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. 
 
వీరిలో 17 యేళ్ళ కుమార్తె ఒకరు. ఆమెను నిత్యం వేధించసాగాడు. పైగా, ఆ యువతి బయటకు చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు గురిచేయసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆ యువతి.. తండ్రిపై కక్ష పెంచుకుంది. ఈ వేధింపుల నుంచి విముక్తి పొందాలంటే ఆయన్ను లేకుండా చేయడమే ఉత్తమన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తన స్నేహితలను సంప్రదించింది. ఆదివారం అర్థరాత్రి తన నలుగురు స్నేహితులను ఇంటికి పిలిచింది. వారంతా కలిసి దీపక్ సింగ్‌పై మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడి సమయంలో ఆ యువతి ఇద్దరి చెల్లెళ్లు కూడా అక్కడే ఉండటం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న యువతితో పాటు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments