Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7,000లకు నెల రోజుల మగ శిశువును అమ్మేశారు..!

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (09:21 IST)
జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దశరథపూర్ ప్రాంతంలో సంతానం లేని దంపతులకు రూ.7,000లకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల వయస్సు గల బాలుడిని జాజ్‌పూర్ పోలీసులు మంగళవారం కాపాడారు. సోమవారం తన బిడ్డను రక్షించాలంటూ పాప తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బిక్రమ్ ముండా, అతని భార్య జంగా ముండా బిరాజా దేవాలయం ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారని.. రోజువారీ కూలీ పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు అప్పటికే ఒక కుమార్తె సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంగా గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
దీంతో దంపతులు సోమవారం జాజ్‌పూర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించాల్సిందిగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ)కి సమాచారం అందించారు. పోలీసులు, డిసిపిఓ, చైల్డ్‌లైన్ అధికారుల బృందం మంగళవారం హలాదిపాడు గ్రామానికి వెళ్లి చిన్నారిని రక్షించారు. 
 
"శిశువు ప్రస్తుతం స్థానిక చైల్డ్‌లైన్ అదుపులో ఉంది. పోలీసులు కేసును విచారిస్తున్నారని" చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బరేంద్ర కృష్ణ దాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments