Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై భర్త దాడి!!

Advertiesment
crime

ఠాగూర్

, సోమవారం, 16 సెప్టెంబరు 2024 (16:34 IST)
తాను చేసిన అప్పులు తీర్చలేక పోయిన వ్యక్తి.. తన భార్యపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. తాను అప్పులు తీసుకున్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. భర్త తెచ్చిన ప్రతిపాదనకు భార్య అంగీకరించలేదు. దీంతో ఆమెను పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాను చేసిన అప్పులు తీర్చేందుకు స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని హుణసగి నివాసి భీమణ్ణ భాగలేర అనే వ్యక్తి తన భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో జూలై 25వ తేదీన ఆమెను హత్య చేశాడు. అపరిచితులు ఎవరో తన భార్యను హత్య చేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. విచారణలో అతనే హత్య చేశాడని గుర్తించి శహపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. 
 
గత నెల మొదటి వారంలో అరెస్టు చేశారు. తన భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో హత్య చేశాడని ఆరోపించాడు. మృతురాలి సోదరుడికి తన బావ చేసిన ఆరోపణల్లో నిజం లేదని గుర్తించారు. తన సోదరి చరవాణిని పరిశీలించగా అందులో కాల్ రికార్డింగ్‌లను విని నిర్ఘాంతపోయాడు. తన బావ చేసిన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతోనే హత్య చేశాడని పోలీసులకు ఆదివారం మరో ఫిర్యాదు చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితులతో మందేసింది.. తలనొప్పిగా వుందని వెళ్లి ఉరేసుకుంది..