Webdunia - Bharat's app for daily news and videos

Install App

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (12:23 IST)
భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకుని మన వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం రోదసీలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు ఆస్ట్రోనట్స్ కూడా వెళ్లారు. వీరందరినీ యాక్సియం-4 నింగిలోకి తీసుకెళ్లింది. 
 
ఫ్లోరిడాలోని నాసా కెన్నడి స్పేస్ సెంటరులో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. నిజానికి ఈ ప్రయోగం మే 29వ తేదీనే చేపట్టాల్సివున్నప్పటికీ వివిధ రకాలైన సాంకేతిక కారణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. 
 
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత రోదసి పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరక్ష పరిశోధనా సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కి, విస్నియెస్కీ రోదసిలోకి వెళ్ళారు. ఈ ప్రయోగంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
అంతరిక్షంలో ఆయనను శుక్స్‌గా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో అనుసంధాన అవుతుంది. ఇక్కడ శుభాంశు బృందం మొత్తం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోడీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ఆయన ముచ్చటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం